అన్నింటిలో వివక్ష ఎదురుకున్న ఓ ఆడపిల్ల వ్యధ...విజయంతో నిలిచిన తీరును ..ఈ కవిత్వంలో చేప్పే చిన్న ప్రయత్నం...

ఆడపిల్ల వంటూ
ఎన్నో ఆంక్షలు
ఉన్నతంగా ఎదగాలనే వాంఛ నీది
వివక్షే స్వాగతం అన్నింటా
డిగ్రీ పట్టా రాకముందే..
భాజాభజంత్రీలు
కొత్తేమి లేదు..అగాధమే శరణ్యమాయే..
అడుగడుగునా చిత్కారింపులు,చీదరింపులే
నీ చదువు,జ్ఞానం గడ్డిపోసతో సమానమనే హేళనలు..
ఉపిరి సలపని పనితో సతమతమవుతున్న..
ఓదార్పు కరువాయె
అభిమానం దెబ్బతినే తూటాలాంటి
మాటలు..
నిలువునా దహించివేస్తున్నా
నా అనే కనిపించని శత్రువుతో..
కానరాని యుద్ధం చేస్తూ
గడియారంతో పోటీ పడుతూ
ఇల్లాలిగా,తల్లిగా చక్కబెడుతూ
కసిగా లక్ష్యం వెైపు అడుగులేస్తుా
విమర్శల బాణాలు వాడిగా
గాయం చేస్తున్నా..
లక్ష్యం గురితప్పలేదు
తనలాంటి వారిని విజ్ఞానజ్యోతులుగా మలిచి
ఈ సంఘానికి అందించే కొలువులో
రాణిస్తూ.....
ఈ ఆడపిల్ల ప్రయాణం....అజేయంగా సాగాలని........copy post

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)