God / Nature / Ideology

*🌀జంధ్యమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా?*

*🌀టోపీ ధరించినంత మాత్రాన ఇస్లాం సారం వంటపట్టినట్టేనా?*

*🌀ఎద పై శిలువ వ్రేలాడదీసుకున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్టేనా?*

*🌀జంధ్యమేసుకొమ్మని, టోపీ లు, శిలువలు ధరించమని నేను చెప్పానా?*

*🌀నేను మిమ్మల్ని, మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం కుల, మతాలను సృష్టించుకుని చంపుకుంటూ చివరకు నాకోసమే అని సమర్ధించుకుంటారా?*

*🌀మీ అవసరాలకు, విలాసాలకు ప్రకృతి ని నాశనం చేసి విలయాలకు బాధ్యున్ని నేనంటూ నన్ను ఆడిపోసుకుంటారా?*

*🌀దీక్షలు తీసుకోమని నేనుచెప్పానా?*

*🌀కడుపు కాల్చుకోమని నేను చెప్పానా?*

*🌀మోకాళ్ళ మీద నడిచి రమ్మని నేను చెప్పానా?*

*🌀మీలోనే ఉన్న నన్ను కనుగొనలేక గుళ్ళలో, మసీదు లలో, చర్చి లలో వెతుకుతున్నారు..*

*🌀మీ తల్లిదండ్రులలొ నన్ను చూసుకోమని చెప్పాను, చెప్పింది మాత్రం చెయ్యరు*

*🌀ఆకలన్నవానికి పిడికెడు ముద్ద పెట్టలేరు కానీ హుండీ లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు, మీరిచ్చే కాగితపు నోట్లు నాకు అవసరమా?*

*🌀మీరు సృష్టించుకున్న కాగితాలకిస్తున్నంత విలువ మానవ సంబంధాలకు ఇవ్వడం మర్చిపోయారు!*

*🌀ఎప్పటికైనా మీరు నాదగ్గరకు రావలసిన వారే అన్న స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు!!*

*🌀చనిపోయిన తరువాత మిమ్మల్ని చుట్టే వస్త్రానికి జేబులు ఉండవు!!!*

*🌀సంపాదించిన సొమ్మును దాచుకోడానికి నీ సమాధిలో బీరువాలు ఉండవు, చనిపోయిన తరువాత మిమ్మల్ని తీసుకు వచ్చే నా దూతలు మీ ప్రలోభాలకు లొంగి లంచం కూడా తీసుకోరని గుర్తించుకోండి....!!!*

*🎯మిమ్మల్ని సృష్టించి తప్పు చేసి మీ చేతిలో ఆటబొమ్మ ఐన..*

                           *మీ*
                  *💐దేవుడు💐*

Comments

Popular posts from this blog

Millets in Telugu (Siri-Dhanyalu / Chiru-Dhanyalu)